కోర్సులపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

కోర్సులపై దృష్టి పెట్టాలి

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

కోర్సులపై దృష్టి పెట్టాలి మెలకువలు నేర్పుతారు కొత్త దిశను చూపుతాయి

ప్రభుత్వం అందిస్తున్న కోర్సులు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. క్రీడారంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇవి కీలకం. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా మంచి అవకాశాలు అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా ఇవి చాలా సహాయపడతాయి. ప్రతీ క్రీడాకారుడు కోర్సులపై దృష్టి పెట్టాలి.

– బుర్ర మల్లేశ్‌గౌడ్‌, కబడ్డీ సంఘం కార్యదర్శి

శిక్షణ ద్వారా క్రీడాకారులు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మెలకువలు నేర్చుకుంటారు. శాసీ్త్రయ శిక్షణ పద్ధతులు నేర్పుతారు. ట్రైనింగ్‌ తీసుకున్నవారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోచ్‌గా ఎదిగి, దేశానికి పతకాలు తెచ్చే క్రీడాకారులను తయారు చేయొచ్చు.

– బసరవేణి లక్ష్మణ్‌,

హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి

ఈ కోర్సులు క్రీడాకారులకు కొత్త దిశను చూపుతాయి. శిక్షణతో పాటు శాసీ్త్రయ పరిజ్ఞానం అందించడం గొప్ప విషయం. ప్రస్తుతం ప్రొఫెషనల్‌ కోచ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. కోర్సులు పూర్తి చేసినవారు దేశానికి మంచి సేవ చేయగలరు.

– గెల్లు మధుకర్‌యాదవ్‌,

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్‌ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement