● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్
కరీంనగర్ టౌన్: తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక విధివిధానం సరిగా లేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను, దివ్యాంగులైన ఉద్యమకారులను, జైలుకెళ్లిన ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం కమిటీని ప్రకటిస్తే.. ఆ కమిటీకి సంబంధించిన జీవో కాలపరిమితి విధివిధానాలు బహిర్గతం చేయాలని అన్నారు. వివిధ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారి పత్రిక వార్తలు, వీడియోల ఆధారంగా గుర్తించాలన్నారు. ఉద్యమకారుల మనోభావాలను గుర్తించి కమిటీ విధివిధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, చొప్పరి సుధాకర్, గరిగే కోటేశ్వర్, మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, మహాదేవుని భార్గవి, బాలామణి, వనజ, పద్మ, కనకలక్ష్మి, సంధ్య, కోమల, శారద, సుజాత, దేవేంద్ర, గాలి రమేశ్, బూడిద వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


