25న కో ఆప్షన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

25న కో ఆప్షన్‌ ఎన్నిక

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

● బీజేపీ ఖాతాలోకే పదవులు! రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుధాకర్‌రావు

● బీజేపీ ఖాతాలోకే పదవులు!

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్‌ పదవుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎన్నికకు సంబంధించి ఈ నెల 25వ తేదీన నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఐదు స్థానాలకు గాను గతంలో ఎప్పు డూ లేని విధంగా 46 మంది దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఈ నెల 16వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగియగా 25వ తేదీన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికను చేపట్టనున్నారు. 46 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికార బీజేపీ ఐదు స్థానాలను కై వసం చేసుకోనుంది. బీజేపీ నుంచి కన్న కృష్ణ, నందకుమార్‌, హఫీ జాబేగం, బల్బీర్‌సింగ్‌, చిగిరి వెంకటమ్మ పోటీపడుతుండగా, ఎన్నిక లాంచనమే కానుంది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించగా, బీఆర్‌ఎస్‌తో పాటు దరఖాస్తు చేసుకొన్న ఇతరులకు పెద్దగా ఆశలు లేకుండా పోయాయి. కో ఆప్షన్‌ ఎన్నికల్లో మొత్తం 69 ఓట్లు ఉండగా, 35 మంది బలం ఇప్పటికే బీజేపీకే ఉంది.

తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు

కరీంనగర్‌కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ పరిధి లో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆదేశించారు. మంగళవారం ఎస్సారార్‌ రిజర్వాయర్‌ను సందర్శించారు. నీటి ని లువ సామర్థ్యం, పంపింగ్‌ విధానం, మోటార్ల పనితీరుపై ఆరా తీశారు. నీటి సరఫరాలో డివిజన్లవారీగా పాటిస్తున్న సమయపాలన అడిగి తెలుసుకొని, 1వ, 2వ డివిజన్‌ ప్రజలకు నీటి సరఫరాచేయాలని సూచించారు. హై లెవెల్‌ పరిధిలోని అన్ని డివిజన్లకు సమయం ప్రకారం తాగునీరు సరఫరా చేయాలన్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేపట్టి, అరికట్టాలన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అన్నమనేని సుధాకర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికా రులు కాసం మహేందర్‌, పీవీ రామకృష్ణ వెల్ల డించారు. రెండు రోజుల క్రితం నామినేషన్లు స్వీకరించగా పలువురి పోటీపడినా చివరికి నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎ న్నిక ఏకగ్రీవమైంది. గతంలో సుధాకర్‌రావు రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా విశిష్ట సేవలందించారు. కాగా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా 15మంది ఎన్నికయ్యారు. వి.వీరకుమార్‌, బోనగిరి శశికిరణ్‌, పి.మల్లారెడ్డి, కె.కేశవరెడ్డి, వి.మల్లన్న, యం.జితేందర్‌, టి.అశోక్‌రావు, టి.శివ, బుక్క శ్రీనివాస్‌, కె.మల్లిఖార్జున్‌, బి.తిరుపతి, సీహెచ్‌.అయిలయ్య, క్యాస ఉపేందర్‌, పి.సదానందం, పి.విజయేందర్‌రెడ్డి ఎన్నికవగా జిల్లా సెక్రటరీని ఎన్నుకోనున్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

కరీంనగర్‌ సిటీ: పర్యావరణ సుస్థిరత, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలే ‘మనశక్తి– మనగ్రహం’ ఉద్యమానికి మూల స్తంభాలని ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రా మకృష్ణ తెలిపారు. ఎస్సారార్‌ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘బోటనీ అండ్‌ బియాండ్‌ అవర్‌ పవర్‌– అవర్‌ ప్లానెట్‌’ అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్‌ మంగళవా రం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి, ప్రొఫెసర్‌ తిరుకోవెల శ్రీనివాస్‌ జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ సమతుల్య తలో వృక్షశాస్త్రం అనివార్యతను వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement