గ్రామ సర్వే నంబర్ 959లో 22గుంటల భూమి ఉంది. 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుని బతుకుతున్నం. మా వ్యవసాయ భూమికి వెళ్లేదారిని నారాయణ, రాజయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారు. ఆ దారిలోకి వస్తే నరికి చంపుతామంటున్నారు. సాగుభూమిలోకి మేము ఎలా వెళ్లాలి?
– బి.పోచయ్య, జగ్గయ్యపల్లి, మానకొండూరు
ఉద్యోగం ఇవ్వకుండా తిప్పుకుంటుర్రు
నా తండ్రి ఖాదర్‌పాషా డీసీఎంఎస్‌లో డ్రైవర్‌గా పనిచేసి మెడికల్ ఇన్‌వాలిడేషన్ కింద విధుల నుంచి తప్పుకున్నాడు. నాకు ఉద్యోగమివ్వాలని దరఖా స్తు చేశారు. నాకు ఉద్యో గం ఇవ్వకపోగా నా తరువాత దరఖాస్తు చేసినవారికి ఉద్యోగమిచ్చారు. వారికివ్వడంలో నాకు అభ్యంతరం లేదు. కానీ నా కు ఉద్యోగమివ్వడంలో ఏళ్ల తరబడి నాన్చుతున్నా రు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు.
– ఎండీ.అరిఫ్‌పాషా, శ్రీనగర్‌కాలనీ, కరీంనగర్


