కరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం సేవలందించనుంది. జిల్లాల విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటగా ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘంగానే సేవలందాయి. 55 మండలాలు, 707 ప్రాథమిక సహకార సంఘాల భాగస్వామ్యంతో సంఘం సేవలందించింది. తాజాగా జిల్లాల వారీగా సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సహకార ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.సుబ్బారాయుడు జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్‌ను అధికారికంగా సోమవారం అందజేశారు. 16 మండలాలు, 243 గ్రామ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘాలతో జిల్లా నూతన సంఘం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ నంబర్ స్వీకరించిన జిల్లా యూని యన్ అడహక్ కమిటీ ఛైర్మన్ బాసవేని మల్లేశం, డైరెక్టర్లు బుచ్చన్న, ఓదెలు, సురేష్, శ్రీనివాస్, రవీందర్, సదానందం, ఆంజనేయులు, రంజిత్, సదయ్య ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
కరీంనగర్ సిటీ: అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. ప్రగతిపథంలో తెలంగాణ అగ్నిమాపకశాఖ సంసిద్ధత అనే అంశంపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్‌శాఖ ఆధ్వర్యంలో వర్సిటీలో సోమవారం అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హా జరైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో హాస్టల్స్, ప్రయోగశాలలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, వోఎస్‌డీ హరికాంత్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామకాంత్, లా కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.8,150
జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.8,150 పలికింది. మోడల్ ధర రూ.7,600, కనిష్ట ధర రూ.7,000 చెల్లించారు. క్రయవిక్రయాలను మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.


