ప్రజా‘వాణి’ వినరూ! | - | Sakshi
Sakshi News home page

ప్రజా‘వాణి’ వినరూ!

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

● ఏళ్ల తరబడి తిరిగినా పడిగాపులే ● కలెక్టర్‌కు బాధితుల ఏకరవు

కరీంనగర్‌ అర్బన్‌: మా భూమి సంబంధం లేని వ్యక్తిపేరున నమోదైంది. ఇదెక్కడి న్యాయమని మండల, డివిజన్‌, జిల్లా అధికారులను కలిస్తే పరిష్కారం లేదు. తిరగవట్టి నాలుగేళ్లవుతుంది. ఇంకెప్పుడు మా సమస్యకు మోక్షం లభిస్తుందంటూ బాధితులు ఏకరవు పెట్టారు. ప్రజావాణికి వచ్చే సమస్యల్లో అత్యధికం భూ సమస్యలే కాగా పరిష్కారం ఎండమావే. కొత్త కలెక్టర్‌తోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలే రావడం విశేషం. కలెక్టర్‌ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్‌ అర్జీలు స్వీకరించారు. మొత్తం 238అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు.

మొత్తం అర్జీలు: 238

కరీంనగర్‌ కార్పొరేషన్‌: 59

ఎంపీడీవో కొత్తపల్లి: 14

డీపీవో: 12

కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌: 11

ఆర్డీవో,కరీంనగర్‌: 10

మానకొండూరు తహసీల్దార్‌: 09

Advertisement
 
Advertisement
Advertisement