హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం | - | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

కరీంనగర్‌: హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని శ్రీశ్రీశ్రీ ముక్తానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని బృందావన్‌గార్డెన్‌లో హిందూ సమ్మేళనం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ హిందుత్వం మానవాళిహితం కోరే ధర్మమని అన్నారు. మతం వేరు, ధర్మం వేరని పేర్కొన్నారు. కుటుంబం నుంచి పరివర్తనకు మహిళలు పాటుపడాలని కోరారు. హిందువులు కులాల వారీగా విభజించబడడం హేయమని, సమైక్యంగా కలిసి జీవించాలన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ సంపర్క్‌ ప్రముఖ్‌ ఎన్నమనేని అశోక్‌రావు మాట్లాడుతూ దేశభక్తి సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అని, దేశభక్తులను తయారు చేయడమే ఉద్దేశమన్నారు. పాఠశాల విద్యార్థుల నాటికలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమితి అధ్యక్ష, కార్యదర్శులు గూ డ అశోక్‌రెడ్డి, మేకల ఓంప్రకాశ్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్లు నాంపల్లి రేణుక, సౌగాని కొమురయ్య, దక్షిణామూర్తి, నీలిమ, నాగరాజు, గజేందర్‌, రవీందర్‌, రాజిరెడ్డి, మల్లారెడ్డి, మామిడి రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement