కరీంనగర్ టౌన్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నా యి. 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 23, కరీంనగర్‌లో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి 1,588 మంది, ఇంటర్ పరీక్షలకు 2,752 మంది హాజరుకానున్నారు. కరీంనగర్‌లో సుభాష్‌నగర్ ప్రభు త్వ హైస్కూల్, సప్తగిరికాలనీ హైస్కూల్, దన్గర్‌వాడీ హైస్కూల్, కుమ్మర్‌వాడి హైస్కూల్, ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ కాలేజీ, సహస్ర కాలేజీ, వాణినికేతన్ స్కూల్, సాన్వి కాలేజీ, కార్ఖానగడ్డ హైస్కూల్, రాంనగర్ హైస్కూల్, సవరన్ హైస్కూల్, ట్రినిటీ జూనియర్ కళాశాల భగత్‌నగర్, సెయింట్ అల్పోన్స్ , జ్యోతినగర్, హు జూరాబాద్, జమ్మికుంటలో కేంద్రాలు ఏర్పా టు చేశారు. వివరాలకు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ 9440415099ను సంప్రదించవచ్చు.
నేడు రెండో విడత రైతు భరోసా
కరీంనగర్ అర్బన్: సీజన్‌కు ముందు ఇవ్వాల్సి న రైతు భరోసా ఇంకా సాగుతోంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌కు ఎకరానికి రూ.6వేలు అన్నదాత ఖాతాలో జమ కావాల్సి ఉండగా పడిగాపులు తప్పడం లేదు. గత నెల 25న మొదటి విడతగా ఎకరం సాగు భూమి గల రైతులకు రైతు భరోసా నిధులు జమ కాగా తాజాగా సోమవారం రెండో విడతగా రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. రెండెకరాల వరకు జమవుతాయా.. ఐదెకరాల వరకా అన్నది స్పష్టత లేదు. కాగా సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనుండగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు రైతు వేదికల్లో ఏర్పాట్లు చేశారు. రైతులందరూ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు.
మహిళా బిల్లు వెనుక బీజేపీ కుట్ర
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా బిల్లు వెనుక, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే బీజేపీ కుట్ర దాగి ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. వాస్త వ పరిస్థితిని విస్మరించి స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన చేయడాన్ని ఎద్దేవా చేశారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో, కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని అధికారాన్ని హస్తగతం చేసుకొనే కుటిల రాజకీయంలో భాగంగానే, మహిళా బిల్లుతో కలిపి డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని ఆరోపించారు. పైగా మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ను అపవాదుకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించి, సోమవారం మళ్లీ కేవలం మహిళా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దక్షిణాదికి నష్టం వాటిల్లుతున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నోరుమెదపకపోవడం విడ్డూరమన్నారు. అర్బన్ బ్యాంక్‌చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, కాంతాల జగన్‌రెడ్డి, పర్వతం మల్లేశం, గుమ్మడి రాజ్ కుమార్ పాల్గొన్నారు.
ఎస్సై కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం
ఇల్లందకుంట: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్సై చంద్రశేఖర్ దంపతుల కుటుంబానికి పోలీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అండగా నిలిచారు. మండలంలోని సీతంపేట గ్రామంలో ఆదివారం చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు రూ.25లక్షల విలువైన చెక్కు అందించారు. చంద్రశేఖర్ ఇద్దరు కుమారుల పేరిట తలో రూ.12.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2014 బ్యాచ్‌కు చెందిన సుమారు 700 మంది ఎస్సైలు 2021లో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. పిల్లల చదువులకు, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


