అవసరాలు గుర్తించి పనులు చేశాం | - | Sakshi
Sakshi News home page

అవసరాలు గుర్తించి పనులు చేశాం

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

అవసరాలు గుర్తించి పనులు చేశాం స్థలం కొని బస్‌షెల్టర్‌ కట్టాం అనేక పనులు జరిగాయి చెరువు పనికి వెళ్లాను

సాయుధులుగా పల్లెల్లో తిరుగుతున్న క్రమంలో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను, వారి అవసరాలను గుర్తించి పనులు చేయించాం. అప్పట్లో ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని పనులు, మరికొన్నింటిని నేరుగా పార్టీ రంగంలోకి దిగి ప్రజల భాగస్వామ్యంతో చేశాం. అనేక బోర్లు వేయించాం. బస్‌షెల్టర్లు కట్టించాం. పార్టీకి పట్టున్న గ్రామాల్లో ప్రజాసమస్యలను అనేకం తీర్చాం. – ఎడ్ల లక్ష్మీరాజం అలియాస్‌ సాగర్‌,

జనశక్తి జిల్లా మాజీ కార్యదర్శి

కట్టలింగంపేటలో స్థలం కొనుగోలు చేసి బస్‌షెల్టర్‌ కట్టాం. ఇంటికి రూ.600 చొప్పున జమచేసుకున్నాం. అప్పట్లో కొన్ని డబ్బులు అన్నలు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ డబ్బులు తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో అన్నల ప్రోద్బలంతో పనులు చేశాం. ఇప్పటిలాగా లేదు.. అప్పట్లో రాత్రి 6 గంటలు అయిందటే తలుపులు మూసుకుని పడుకునేవాళ్లం. భయం భయంగా ఉండేది.

– గండ్ర లక్ష్మణ్‌రావు,

మాజీ సర్పంచ్‌, కట్టలింగంపేట

అప్పట్లో నక్సలైట్లు ఏది చెబితే అది జరిగేది. ప్రజలకు ఇది కావాలంటే.. గ్రామస్తుల భాగస్వామ్యంతో చేసేవారు. అప్ప ట్లో ప్రైవేటు బస్సులను కొని చ్చారు. బస్‌షెల్టర్‌ నిర్మించా రు. ప్రైవేటుగా టీచర్లను నియమించి వాళ్లకు జీతాలు ఇచ్చాం. రోడ్డు వేయించుకున్నాం. మా ఊరిలో అన్నల ఆధ్వర్యంలో అనేక పనులు జరిగాయి. ఇప్పుడు అదంతా గతించిన చరిత్ర. నేటితరం యువకులకు ఆ నాటి సంగతులు తెలియవు.

– లింగంపల్లి రాజం, సనుగుల

రంగంపేట మార్గండి(జంపన్న) చెరువు నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాను. అప్పట్లో ఊరంతా చెరువు పనులు చేయాలని నిర్ణయించడంతో పనులు జరిగాయి. అనేక గ్రామాల్లో అప్పట్లో ఏదో ఒక్క పని నక్సలైట్ల ప్రోద్బలంతో జరిగేవి. పోలీసులతోనూ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటి సంగతులు ఇప్పటి తరానికి ఏమి తెలియవు.

– సుతారి మల్లయ్య,

మాజీ ఉపసర్పంచ్‌, రంగంపేట

Advertisement
 
Advertisement
Advertisement