మనస్తాపంతో టవరెక్కిన ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో టవరెక్కిన ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

రామగుండం: రామగుండం నగరానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నయీం ధర్మపురిలో ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో శనివారం మనస్తాపం చెంది బీ–కాలనీలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై సంధ్యారాణి ప్రత్యేక చొరవతో బాధితుడితో మాట్లాడి రెండు గంటల తర్వాత కిందకు దింపారు. బాధితుడి కథనం మేరకు.. అబ్దుల్‌ నయీం 2020లో ఓ యువతిని మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు సంతానం. గతేడాది డిసెంబర్‌లో కుటుంబసభ్యుల ప్రమేయంతో కేసు నమోదు కావడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. తర్వాత అత్తాగారి కుటుంబంతో వివాదాలు తలెత్తాయి. ఈనేపథ్యంలో భార్యాభర్తల వివాదంలో ఓ వ్యక్తి జోక్యం చేసుకొని ఆర్థికంగా సర్దుబాటు చేస్తూ తన భార్యకు దగ్గరయ్యాడని అబ్దుల్‌ నయీం ఆరోపించాడు. ఈక్రమంలో కూతురు సంరక్షణపై భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. కూతురును తల్లికి అప్పగించాలని ఓ వైపు పోలీసులు ఒత్తిడి చేయడం, మరో వైపు భార్యతో తనకు ప్రాణపాయం ఉందంటూ బాధితుడు వాయిస్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ రోదించాడు. ఈ విషయమై రామగుండం సీఐని వివరణ కోరగా ఆదివారం ఇరువర్గాలతో చర్చించి బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement