జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ (106) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. అన్నపూర్ణమ్మకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కొన్నాళ్లు మునిమనుమల ఆనందంగా గడిపారు.
చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్..
గోదావరిఖని(రామగుండం): ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ కవ్వంపల్లి సత్తయ్య(46) తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈనెల 13న జీఎం కాలనీ సమీపంలో సత్తయ్య ట్రాక్టర్ నిలిపి మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కదిలి అతడి తొడపై నుంచి టైరు వెళ్లింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన సత్తయ్యను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ట్రక్ ఢీకొని ప్రైవేట్ టీచర్..
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖనిలోని ఇందిరానగర్ మహాలక్ష్మి ఫంక్షన్‌హాల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేరుగు వెన్నెల(26) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్న వెన్నెల తాను ఉంటున్న ఎన్టీఆర్‌నగర్ నుంచి స్కూటీపై ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోని ప్రైవేట్‌స్కూల్‌కు బయలుదేరింది. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ మూలమలుపు వద్ద వెనక నుంచి ట్రక్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. ఈప్రమాదంలో వెన్నెలకు తీవ్రగాయాలయ్యాయి. తలకు హెల్మెట్ ఉన్నా అది పగిలి చెవులు, ముక్కులో నుంచి రక్తం కారింది. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది. మృతురాలి భర్త సింగరేణి ఉద్యోగం చేస్తుండగా, మూడేళ్ల కుమారుడున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.


