వేములవాడ: రాజన్న సన్నిధిలో శనివారం శంకర జయంతి కార్యక్రమాలను ప్రారంభించారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు ఐదు రోజులపాటు స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా కొనసాగనున్నాయని అర్చకులు తెలిపారు. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీగణపతి, స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు చేశారు. సాయంకాలం శంకర విజయంపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.
భీమన్న సేవలో సినీ హీరోయిన్
భీమేశ్వరస్వామిని సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. డీఈవో భాస్కరశర్మ లడ్డూ ప్రసాదం అందజేశారు. ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. డీపీవో సతీష్‌రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, బీరప్పనేని శివ పాల్గొన్నారు.


