కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్ సాగుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ఏడీఏ కార్యాలయంలో వా నాకాలం సీజన్‌పై సమీక్షించారు. సీజన్‌కు ముందే రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశా రు. ఏడీఏ రణధీర్‌రెడ్డి, కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారులు వంశీకృష్ణ, సత్యం, సంతోష్ కుమార్, ఏఈవోలు పాల్గొన్నారు.
వర్సిటీ అభివృద్ధికి కృషి
కరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయానికి నూతనంగా నియామకం అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వీసీ ఉమేశ్‌కుమార్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఎస్‌యూ రిజిస్ట్రార్ సతీశ్ కుమార్ పాల్గొన్నారు.
అమృత్ పథకం పేరుతో పైప్‌లైన్ దందా
కరీంనగర్ టౌన్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్యలు రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలో శుక్రవారం మాట్లాడుతూ నగర ప్రజల ప్రాథమిక హకై ్కన తాగునీటిని పాలకవర్గం సమయానికి అందించడం లేదన్నారు. అమృత్ పథకం పేరుతో అధికారులు రూ.కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమృత్ పథకంలో పైపులైన్లు ఉన్న ప్రాంతా ల్లోనే మళ్లీ పైపులైన్ పేరుతో రోడ్డులను తవ్వి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అమృత్ పథకం పనులపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరానికి సంబంధించిన టెండర్లు వరంగల్‌లో నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మానేరు డ్యామ్‌లో నీటిమట్టం 5 టీఎంసీల దిగువకు పడిపోతున్నా, ముందస్తు చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.
పీజీ ఫలితాలు విడుదల
కరీంనగర్ సిటీ: కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పీజీ తృతీయ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 170 మంది పరీక్షలు రాయగా 158మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత శాతం 92.94గా ఉందని పేర్కొన్నారు. ఎంఎస్సీ బోటనీ కెమిస్ట్రీలో వందశాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ అఫ్సరీ ఉస్మాని, పరీక్షల నియంత్రణాధికారి జి.శ్రీనివాస్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు బి.రజనీదేవి, కె.సతీశ్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు మనోజ్‌కుమార్, విద్య పాల్గొన్నారు.
27 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి
కరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, నాల్గవ సెమిస్టర్ ఫీజు ఈనెల 27వ తేదీ లోపు చెల్లించాలని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. పరీక్షలు జూన్ 2026లో జరుగుతాయని తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఈనెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.


