ప్రజావాణి అర్జీలు నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు నిర్లక్ష్యం చేయొద్దు

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి అర్జీల ప్రగతిపై సమీక్షించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, సంక్షేమ శాఖ, నీటిపారుదలశాఖ, విద్యు త్‌, వెటర్నరీ, పంచాయతీ తదితరశాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్‌ దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. తరచుగా ఫిర్యాదులు వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి తనిఖీ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌, జిల్లా సంక్షేమ అధికా రి సరస్వతి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement