కొలనూర్ గేట్ మరమ్మతులతో గేట్ మూసివేశారు. రాకపోకలకు బాధలు పడుతున్నాం. రైల్వేశాఖ పదిరోజులపైగానే మరమ్మతులు చేస్తోంది. ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం కష్టంగా మారింది.
– నారాయణ, ప్రయాణికుడు, కనగర్తి
చుట్టూ తిరిగిపోతున్నాం
కొలనూర్ గేట్‌ను తరచు మరమ్మతులు చేస్తున్నారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వైపులకు వెళ్లాలంటే.. అనేక ఊళ్లచుట్టూ తిరిగి పోవాల్సి వస్తోంది. పదిరోజులు రిపేరు చేస్తున్నా పనులు పూర్తి కావడంలేదు. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలి.
– బొయిని కొమురయ్య, ప్రయాణికుడు, గోపరపల్లె


