నుస్తులాపూర్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

నుస్తులాపూర్‌లో చోరీ

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

తిమ్మాపూర్‌: మండలంలోని నుస్తులాపూర్‌లో చోరీ జరిగింది. గ్రామంలో షాజిదా బేగం తన కొడుకు ముజహిద్‌, కూతురు సన సుల్తానాతో నివాసముంటోంది. కొడుకు కార్‌ డ్రైవర్‌గా, కూతురు ఆసుపత్రిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 11న మానకొండూరులోని వీరి బంధువు మరణించగా ఆదివారం అందరూ వెళ్లారు తిరిగి ఉదయం ఇంటికి వచ్చారు. ఇంటిని శుభ్రం చేసుకుని తిరిగి అందరూ మళ్లీ మానకొండూర్‌ వెళ్లారు. శుక్రవారం ఉదయం తలుపులు పగుల గొట్టి ఉండటం గమనించిన పక్కింటివారు షాజిదా బేగంకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు వెంటనే ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని రూ.1.10లక్షల నగదు, అర్ధతులం బంగారం, చెవికమ్మలు, 13తులాల వెండి అపహరణకు గురైనట్టు తెలిపారు. ఎల్‌ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement