కూలర్‌లు నడవాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

కూలర్‌లు నడవాల్సిందే..

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

పొద్దంతా, రాత్రంత కూలర్‌లు నడవాల్సిందే. లేదంటే ఎండ, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఉన్నతస్థాయి ఇళ్లలో ఏసీలు ఉన్నా.. మధ్యతరగతి కుటుంబాలకు కూలర్‌లు ఎంతోఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఉక్కపోత, ఎండతీవ్రత తట్టుకోలేక జనాలు చల్లదనం కోసం తపిస్తున్నారు. ఈక్రమంలో కొందరుపాతవి రిపేరు చేస్తున్నార. ఇంకొందరు కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. కొందరు కూలర్‌ల మరమ్మతు చేయించి తీసుకొస్తే, మరికొందరు కొనుగోలు చేస్తూ శ్రీసాక్షిశ్రీ కెమెరాకు ఇలా చిక్కారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement