17 రోజుల హుండీ ఆదాయం రూ.73 లక్షలు | - | Sakshi
Sakshi News home page

17 రోజుల హుండీ ఆదాయం రూ.73 లక్షలు

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

మల్యాల(చొప్పదండి): కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయ హుండీలను శుక్రవారం శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు ఈవో అంజనారెడ్డి, దేవాదాయశాఖ పర్యవేక్షకుల ఆధ్వర్యంలో లెక్కించారు. 17 రోజుల హుండీ ఆదాయం రూ.73,02,163 సమకూరినట్లు ఈవో తెలిపారు. ఏఈవో హరిహరనాథ్‌, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యులు కపీందర్‌, సూపరింటెండెంట్‌ సునీల్‌కుమార్‌, ఏఎస్సై శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమన్న సేవలో రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ

వేములవాడ: భీమన్నను రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేశ్‌నాయుడు(ఐపీఎస్‌) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్‌, ఆర్‌ఐ సురేష్‌, ఎస్సైలు, ప్రొటోకాల్‌ ఏఈవో అశోక్‌కుమార్‌, ఆలయ పర్యవేక్షకులు ఎన్‌.రాజేందర్‌, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకులో అగ్నిప్రమాదం

రూ.5.50 లక్షల ఆస్తినష్టం

గోదావరిఖనిటౌన్‌: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఇండియన్‌ బ్యాంకులో శుక్రవారం షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం బ్యాంకు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఫైర్‌ ఆఫీసర్‌ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఘటనలో సుమారు రూ.5 లక్షల 50 వేల ఆస్తినష్టం వాటిల్లందని, మరో రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం కాకుండా కాపాడమని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement