‘యమునా’ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు ఏవి? | - | Sakshi
Sakshi News home page

‘యమునా’ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు ఏవి?

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

రామగుండం: వచ్చే జూన్‌ 2 నుంచి 13వ తేదీ మధ్య యమునా నది పుష్కరాలు నిర్వహించనున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌ వైపు వెళ్లేందుకు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ రెండు నెలల ముందుగానే రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. కనీసం వెయిటింగ్‌ లిస్టులోనూ టికెట్‌ లభించగదు. గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభామేళా తరహాలో యమునానది పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లి పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

పుష్కరాలు జరిగే ప్రాంతాలు

ఉత్తరాఖండ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో యమునా నది పుష్కరాలు జరుగుతాయి. మథుర(విశ్రామ్‌ఘాట్‌), బృందావన్‌(కేశిఘాట్‌), ప్రయాగ్‌రాజ్‌ (త్రివేణి సంగమం), యమునోత్రి(నది జన్మస్థలం), ఢిల్లీ(నిగంబోధ్‌ ఘాట్‌) తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంతపూర్‌–లక్నో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ వైపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నోబెర్త్‌లు

రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు ఫుల్‌

జూన్‌ 2 నుంచి యమునా పుష్కరాలు

Advertisement
 
Advertisement
Advertisement