రామగుండం: ప్రసవం కోసం తమ స్వస్థలం ఒడిశాలోని రూర్కెలాకు బిలాస్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్న గర్భిణికి హఠాత్తుగా నొప్పులు రావడంతో రామగుండం రైల్వేస్టేషన్‌లో దింపి పురుడు పోశారు. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేశ్ మీనా కథనం ప్రకారం.. గర్భిణి జిథానీదేవి తన భర్తతో కలిసి బిలాస్‌పూర్ రైలులో బుధవారం ఉదయం తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఎక్కింది. రైలు పెద్దపల్లి స్టేషన్ దాటిన తర్వాత పురిటినొప్పులు అధికం అయ్యాయి. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించి రామగుండంలో రైలును అత్యవసరంగా నిలిపివేయించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది.. వెంటనే ఆటోలో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు ప్రసవం చేయడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గత జనవరి 14న బిహార్‌కు వెళ్లే క్రమంలో రామగుండంలోనే పురిటి నొప్పులతో రైల్వే శానిటరీ సిబ్బంది ఓ గర్భిణికి ప్లాట్‌ఫారంపైనే సుఖప్రసవం చేసినవిషయం తెలిసిందే.
అత్యవసరంగా రామగుండంలో దింపిన సిబ్బంది


