ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతి

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్‌లోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. బీర్‌పూర్‌ మండలం కందెనకుంట గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా కృష్ణానగర్‌లోని ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా.. వైద్యులు గర్భసంచి ఆపరేషన్‌ చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం ఆపరేషన్‌ చేశారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యజమాన్యం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇవ్వడంతో శాంతించారు.

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement