కొత్తపల్లి: విద్యుత్ ఉద్యోగులతో సమానంగా సర్వీ సు రూల్స్ వర్తింపజేసి సంస్థలో విలీనం చేసుకోవా లని ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని విద్యుత్ భవన్ ఎదుట చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 9వ రోజైన గురువారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, బీఎంఎ స్ రాష్ట్ర, జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. హన్మకొండ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రా మానికి చెందిన పెద్దాపూర్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ బోడ కొమ్మాలు టర్మినేషన్ చేస్తారమోనన్న భయంలో హఠాన్మరణం చెందడంపై సంతాపం ప్రకటించారు.
పల్లె పల్లెనా చలివేంద్రాలు
కరీంనగర్ అర్బన్: వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభవృద్ధిశాఖ సంచాలకురాలు దివ్య దేవరాజన్ డీఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా 40కి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వేడి తీవ్రత తట్టుకోలేక జనాలు తల్లడిల్లిపోతున్నారు. కాగా జిల్లాలో 318 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


