కరీంనగర్‌క్రైం: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్‌శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్– అలైవ్’ భద్రత వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం కరీంనగర్ చేరుకున్నారు. డీజీపీకి సీపీ గౌస్ ఆలం ఇతర ఉన్నతాధికారు లు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికా రు. శుక్రవారం నగరంలో నిర్వహించే జిల్లాస్థాయి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు
కరీంనగర్‌క్రైం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు గురువారం ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ లు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్‌కార్డుల దుర్విని యోగం వంటి అంశాలపై ఆరా తీశా రు. బాండుపేపర్ల లైసెన్సులు, ప్రభుత్వ ఆదా యానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై దృష్టి సారించారు. ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలించారు. కార్యాలయాల్లో అనధికా రిక వ్యక్తుల జోక్యంపై చర్యలు తీసుకుంటా మని విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
జగిత్యాల సభకు తరలిరావాలి
కరీంనగర్‌టౌన్: ఈనెల 20న జగిత్యాలలో కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలతో పాటు, ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూ చించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నియోజవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు ఏ గ్రామం నుంచి ఎంత మంది తరలివస్తున్నా రు. పట్టణం నుంచి ఎంత మంది రానున్నారు. రవాణా, భోజన సదుపాయాల నిర్వహణపై చర్చించారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కమలాకర్ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.8,050
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిలకడగా కొనసాగుతుంది. గురువారం మార్కెట్‌కు ఏడు వాహనాల్లో 75 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. గరిష్టంగా 8,050, మోడల్ ధర రూ.7,400, కనిష్ట ధర రూ.6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శుక్రవారం అమవాస్య, శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం మార్కెట్లో కొనగోళ్లు యథావిధిగా జరుగుతాయని చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
సిటీలో పవర్‌కట్
కొత్తపల్లి: విద్యుత్ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ. డీఎఫ్‌వో ఫీడర్ పరిధిలోని సవరన్ స్ట్రీట్, డీఎఫ్‌ఓ చౌరస్తా, సీఎంఆర్ షాపింగ్ మాల్, సాహెత్‌నగర్ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ.సుభాష్‌నగర్ ఫీడర్ పరిధిలోని సుభాస్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.


