కరీంనగర్ అర్బన్: వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అటవీ శాఖ అధికారులు పాల్గొనగా వన్యప్రాణుల అక్రమ రవాణా నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అడవి జంతువులు, పక్షుల అక్రమ తరలింపును అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాలు.. కీలక మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.


