‘సెస్‌’ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ | - | Sakshi
Sakshi News home page

‘సెస్‌’ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలతో హైకోర్టులో బుధవారం కౌంటర్‌ దాఖలు చేసింది. ‘సెస్‌’ పాలకవర్గం పదవీకాలం 20 నెలలు ఉండగానే.. ‘సెస్‌’ వ్యాపార లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయకుండా ఎన్పీడీసీఎల్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై ‘సెస్‌’ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇప్పటికే ఎన్పీడీసీఎల్‌ కౌంటర్‌ దాఖలు చేయగా.. ప్రభుత్వ న్యాయవాదులు మరో కౌంటర్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణను న్యాయమూర్తి వై.రేణుక ఏప్రిల్‌ 20కి వాయిదా వేశారు. ఇప్పటికే జిల్లాలో ఎన్పీడీసీఎల్‌ పూర్తి స్థాయిలో విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తోంది. ‘సెస్‌’ సంస్థకు ఎండీగా పనిచేస్తూ ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈగా మారిన బి.భిక్షపతిని ఉన్నతాధికారులు ములుగు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా పూర్తి స్థాయి ఎస్‌ఈగా టి.వేణుమాధవ్‌ను నియమించారు. ‘సెస్‌’ సంస్థ ఉంటుందా.. రద్దు అవుతుందా.. అనే అంశం కోర్టు పరిధిలో ఉండగా.. అది ఎప్పుడు తేలనుందో అంతుచిక్కడం లేదు. ఏది ఏమైనా సిరిసిల్ల ‘సెస్‌’ సంస్థ భవిష్యత్‌, పాలకవర్గం ఆజమాయిషీ కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండడం చర్చనీయాంశమైంది.

విచారణ 20కి వాయిదా

Advertisement
 
Advertisement
Advertisement