● ‘హర్ ఘర్ జల్ పథకం’లో గ్రామాల ఎంపికకు శ్రీకారం ● జిల్లాలో 12 గ్రామాల ఎంపిక
గంభీరావుపేట(సిరిసిల్ల): ఇంటింటికీ సురక్షిత నీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సురక్షిత నీటితోనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని విశ్వసిస్తున్నారు. ఈక్రమంలోనే జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ‘హర్ ఘర్ జల్’ అనే పథకాన్ని గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా అమలు చేస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోని ఇళ్లకు పైపులైన్‌ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించాలనేది లక్ష్యం.
తొలి గ్రామం కోళ్లమద్ది
జిల్లాలోని 12 మండలాల్లో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. వందశాతం ఇళ్లకు పైపులైన్‌ల ద్వారా నీరందిస్తున్నారా.. లేదా పరిశీలించి ఎంపిక చేస్తారు. జిల్లాలో మొట్ట మొదటిసారిగా గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామాన్ని ఎంపిక చేసి హర్ ఘర్ జల్ పథకం కింద ఎంపిక చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పావని చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను సర్పంచ్ దిలీప్‌కుమార్‌కు బుధవారం అందించారు. కోళ్లమద్దిలో 292 ఇళ్లు ఉండగా.. ప్రతీ ఇంటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
కలిగే ప్రయోజనాలు
శుభ్రమైన నీరు లభించడం ద్వారా జలజనిత వ్యాధులు తగ్గుతాయి. నీటిని తెచ్చే కష్టాలు తగ్గి సమయం ఆదా అవుతుంది. ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తారు. నీటి నిల్వలపై అవగాహన పెరుగుతుంది. నీటి సంరక్షణ, నీటి వినియోగాన్ని తగ్గించడానికి వీలవుతుంది.
ఎంపికై న గ్రామాలివే..
మండలం గ్రామం
ముస్తాబాద్ రాంరెడ్డిపల్లి
తంగళ్లపల్లి కస్బెకట్కూర్
వీర్నపల్లి అడవిపదిర
ఎల్లారెడ్డిపేట బుగ్గరాజేశ్వరతండా
ఇల్లంతకుంట ఆరేపల్లి
బోయినపల్లి తడగొండ
వేములవాడ గుర్రంవానిపల్లె
వేములవాడరూరల్ చెక్కపల్లి
కోనరావుపేట మర్తన్నపేట
చందుర్తి అనంతపల్లి
రుద్రంగి రూప్‌నాయక్‌తండా


