మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతి

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతి లేగదూడపై చిరుత దాడి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): స్నేహితుని పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వ స్తుండగా రోడ్డుపక్కన ఉన్న మైలురాయిని ఢీకొ ని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన వర్కోలు రామకృష్ణ(కోటి) (28) తన స్నేహితుని పెళ్లికి బైక్‌పై రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి బుధవారం వచ్చాడు. రిసెప్షన్‌ వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా గాలిపెల్లి సమీపంలోని రోడ్డు పక్కగ గల మైలురాయిని ఢీకొని ఎగిరిపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకొని యువకుడు మరణించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, భార్య లాస్య సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణకు ఐదేళ్ల క్రితమే వివా హమైంది. హెల్మెట్‌ పెట్టుకుని ఉంటే బతికేవా డని స్థానికులు తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్‌ తన సిబ్బందితో వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మృతుని స్వగ్రామం పారువెల్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో లేగదూడపై మంగళవారం రాత్రి చిరుత దాడిచేసి హతమార్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. పోతిరెడ్డిపల్లెకు చెందిన సదుల పూర్ణ గ్రామ శివారు ప్రాంతంలో నివసిస్తుంది. రాత్రి వారి గుడిసెల వద్ద గేదె, దూడను కట్టేయగా, తెల్లవారుజామున లేచి చూసేసరికి చిరుతదాడిలో చనిపోయి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత సంచారంతో రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. రైతులు రాత్రిపూట పోలాల వద్దకు కర్రలతో గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి మోహన్‌లాల్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement