వడగాలులు.. ఉక్కపోత | - | Sakshi
Sakshi News home page

వడగాలులు.. ఉక్కపోత

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

మానేరు వెలవెల

న్యూస్‌రీల్‌

40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు గురువారం నుంచి 22 వరకు హీట్‌వేవ్‌ మధ్యాహ్నం వేళలో తల్లడిల్లుతున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ ఖాయమంటున్న వైద్యులు

మానేరు వెలవెల

గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌/గోదావరిఖని: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ ఈనెల 16 నుంచి 22వరకు హీట్‌వేవ్స్‌ (వడగాలులు) కొనసాగుతాయని వాతా వరణశాఖ (ఐఎండీ) తెలిపింది. మొన్నటిదాకా 30 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలు 12వ తేదీ నుంచి 35 డిగ్రీలపైగా నమోదవడం మొదలైంది. వేసవి మొదలయ్యాక ఈ స్థాయిలో ఎండలు ముదరడం ఇదే తొలిసారి. 40 డిగ్రీలకుపైగా ఎండలు దంచుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. 16 నుంచి 22 తేదీ వరకు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తరువాత అసలు బయటికి రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయం చేసేవారు, ట్రాఫిక్‌ పోలీసులు, సింగరేణి ఓపెన్‌కాస్టు ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలి.

మండుతున్న కోల్‌బెల్ట్‌

రామగుండంలో సింగరేణి ఓసీపీలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రతకు కార్మికులు ఆగమాగమవుతున్నారు. రెండోషిఫ్టు కార్మికులు విధులకు గైర్హాజర్‌ క్రమంగా పెరుగుతోంది. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండోరోజు జంకుతున్నారు. గతంలో మే నెలలో ఎండవేడి అధికంగా ఉండేది. ఈసారి ఏప్రి ల్‌ రెండోవారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే క్వారీల్లో కనీసం 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం క్వారీల్లో సుమారు 45డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేలో ఓసీపీల్లో డ్యూటీలు చేయడం, భూగర్భగనుల్లోకి వెళ్లడం, మండుటెండలో ఇళ్లకు రావడం కష్టంగా ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్‌ ఓసీపీ కార్మికుల నుంచి వస్తోంది. ఎండవేడిలో పనిచేసే కార్మికులకు చలవపందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెస్ట్‌హాళ్లు, క్యాంటీన్లు, ఆఫీస్‌ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంజన్ల ద్వారా చల్లటినీటిని అందిస్తున్నారు. షిఫ్టు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement