కరీంనగర్ సిటీ: రహదారి భద్రత నియమాలు పాటించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ సూచించారు. ఎస్‌యూలోని అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రహదారి భద్రత వారో త్సవాల్లో భాగంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ యువ త జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ వీడాలని, సీట్‌బెల్ట్ ధరించాలన్నారు. ట్రైనీ ఐపీఎస్ సోహన్ సునీల్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దన్నారు. సీఐ కోటేశ్వర్, వీసీ ఓఎస్‌డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్ కుమార్ పాల్గొన్నారు.
ఆదాయ వనరులు పెంచుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సొంత ఆదాయవనరులు పెంచుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నగరపాలకసంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణుమాధవ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పట్టణ సదుపాయాలను మెరుగు పరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంపై మంత్రి వివరించారు. పట్టణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా మున్సిపల్‌శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్టీసీ డిపోల పనితీరుపై ఆర్‌ఎం సమీక్ష
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లతో బుధవా రం బస్‌స్టేషన్‌లో ఆర్‌ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. 2025–26 మార్చి మాసాంతం వరకు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ విభాగాల్లో రీజియన్‌లోని అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. వేసవికాలం నేపథ్యంలో అన్ని బస్‌స్టేషన్లలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. డిప్యూటీ ఆర్‌ఎంలు ఎస్,భూపతిరెడ్డి, పి.మల్లేశం, డిపోమేనేజర్లు విజయమాధురి, ఎం,శ్రీనివాస్, ఎన్.నాగభూషణం, ఎన్,వెంకన్న, వి.రవీంద్రనాథ్, వి.శ్రవణ్‌కుమార్, ఎన్.మనోహర్, సరస్వతి, బి,శ్రీనివాస్, పర్సనల్ ఆఫీసర్ ఎం.సంపత్‌కుమార్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్సారార్‌లో ‘దోస్త్’ హెల్ప్‌లైన్ సెంటర్
కరీంనగర్ సిటీ: దోస్త్ ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరి ష్కరించేందుకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. దోస్త్ కో– ఆర్డినేటర్, ప్రిన్సి పాల్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు దోస్త్ ఆన్‌లైన్ ద్వారా ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల (7172)ను ఎంచుకోవాలని సూచించారు. ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులొస్తే ఎస్సారార్ కళాశాలలోని దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. వైస్ ప్రి న్సిపాల్స్ పి.నితిన్, టి.రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేందర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహిళా కాలేజీలో ఉచిత రిజిస్ట్రేషన్లు
నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉచితంగా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసి, వెబ్ ఆప్షన్స్ పెడతామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి తెలిపారు. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


