ర్యాలీ తీస్తున్న మహిళా మోర్చా నాయకులు
కరీంనగర్: దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ, నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు అపురూప కానుక అందించి మోడీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తోందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్టీ మహిళా మోర్చా జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి మార్క్‌ఫెడ్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కొలగాని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత, ప్రభావతి, గాజ రమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి పాల్గొన్నారు.


