వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

రామడుగు: కరీంనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు రామడుగు మండలం వెదిర శివారులో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాల ప్రకారం కరీంనగర్‌కు చెందిన కానసగొట్టు భారతి(75) కరీంనగర్‌ నుంచి ఆటోలో వచ్చింది. రామడుగు మండలం వెదిర శివారులో దిగింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పటించుకుంది. రోడ్డు వెంట వెళ్తున్నవారు గమనించి మంటలు ఆర్పివేశారు. వెదిర సర్పంచ్‌ శనిగరపు అంజన్‌కుమార్‌, ఎస్సై కె.రాజు ఆటోలో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యతోనే ఆత్మహత్యకు యత్నించిందని, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement