● నారీ శక్తి వందన్ అదినియమ్‌పై మహిళామణుల హర్షం
విద్యానగర్(కరీంనగర్): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం సీట్ల రిజర్వేషన్ కోసం 2023లో నారీశక్తి వందన్ అదినియమ్ (మహిళా రిజర్వేషన్ బిల్లు 2023) బిల్లు తీసుకురాగా ఈ బిల్లును ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి అమోదించారు. బిల్లు రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత అమల్లోకి రానున్నది. 2029 లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను మహిళా రిజర్వేషన్లతో నిర్వహించడానికి మహిళా రిజర్వేషన్ల చట్టంతో ముడిపడిన సవరణ బిల్లుపై ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో బిల్లుపై పలువురు నారీమణుల అభిప్రాయాలు.
దేశ జనాభాల్లో సగం ఉన్న మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అన్న అంశం దశాబ్దాల కాలం నుంచి చర్చలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం 33శాతం మహిళ రిజర్వేషన్ చట్టం వచ్చినప్పటికి అమలులోకి రావడానికి సవరణ చట్టాన్ని తీసుకురావడంతో మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుంది.
– బొమ్మ జయశ్రీ,
ప్రకృతి పర్యావరణ సంస్థ, కరీంనగర్


