ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించింది. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 01 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 వరకు 8,57,237.85 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది. ఇక్కడి యూరియా తెలంగాణతోపాటు 7 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.
లక్ష్యానికి దూరంగా..
కర్మాగారంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12.7లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 8,57,237.85 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. కర్మాగారంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో తక్కువగా ఉత్పత్తి చేశారు. దీనితో ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
యుద్ధంతో గ్యాస్ కోత.. మరింత తగ్గిన ఉత్పత్తి
పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్ సరఫరా తగ్గింది. కర్మాగారంలో 45 శాతం మేర యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సుమారు 78 రోజులపాటు కర్మాగారంలో వార్షిక మరమ్మతులు, సాంకేతిక సమస్యలతో షట్‌డౌన్ చేశారు. దీంతో కర్మాగారంపై ఆర్థిక భారం పడింది. సుమారు రూ.200 కోట్ల వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కర్మాగారంలోని హెచ్‌టీఆర్ మరమ్మతులు చేసేందుకు తరలించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ కొరత, సాంకేతిక సమస్యలు అధిగమించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు.
వార్షిక మరమ్మతులతో తగ్గిన ఉత్పత్తి
2025–26లో యూరియా కేటాయింపు(మెట్రిక్ టన్నుల్లో)
రాష్ట్రం కేటాయింపులు
తెలంగాణ 381318.30
ఆంధ్రప్రదేశ్ 182146.86
కర్ణాటక 150629.76
మహారాష్ట్ర 27724.23
ఛత్తీస్‌గఢ్ 19196.82
తమిళనాడు 66843
మధ్యప్రదేశ్ 29378.88


