కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య

Mar 19 2026 8:24 AM | Updated on Mar 19 2026 8:24 AM

కరీంనగర్‌క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్‌టౌన్‌ సీఐ రాంచందర్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటూ టూటౌన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్‌ చంద్రశేఖర్‌ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లిన చంద్రశేఖర్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

ఉరేసుకుని యువకుడు..

జమ్మికుంట: ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్‌ పరిధిలోని కేశవాపూర్‌ గ్రామానికి చెందిన పాతకాల కిషన్‌(30) ప్రైవేటు సీడ్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి పాతకాల రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement