కమలం కన్ను! | - | Sakshi
Sakshi News home page

కమలం కన్ను!

Jan 15 2026 8:34 AM | Updated on Jan 15 2026 8:34 AM

కమలం కన్ను!

కమలం కన్ను!

30కి పైగా సీట్లు గెలుపే లక్ష్యం

ఇతర పార్టీల అవినీతే ఆయుధంగా బరిలోకి

పార్టీలో మొదలైన చేరికలు, 17న మరింత మంది

ఎంఐఎంను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహం

డివిజన్ల వారీగా సర్వే చేయిస్తున్న బండి సంజయ్‌

కేంద్ర మంత్రి సంజయ్‌కుమార్‌

బల్దియాపై

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

ప్రభుత్వం మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కరీంనగర్‌లో రాజకీయం వేడెక్కుతోంది. మొత్తం 66 డివి జన్లు ఉన్న ఈ బల్దియాపై అధికార కాంగ్రెస్‌, ప్రతి పక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలూ కన్నేశాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి మేయర్‌ పీఠాన్ని కై వసం చేసుకో వాలనే లక్ష్యంతో మూడు ప్రధాన పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. గత పాలకవర్గంలో బీఆర్‌ఎస్‌ అధికార పక్షంగా ఆధిపత్యం కొనసాగగా, బీజేపీ ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవలేక రాజకీయంగా వెనకబడింది. అయితే పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది. ఇటీవల జరిగి న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సగానికి పైగా సీట్లు గెలుచుకుని ఊపు మీద ఉంది. ఇదే ఉత్సాహాన్ని మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగించాలన్న లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ సారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. పంచాయతీ, ము న్సిపల్‌ ఎన్నికలకు మధ్య రాజకీయ సమీకరణాలు, ఓటర్ల అవసరాలు భిన్నంగా ఉండటంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

30కి పైగా సీట్లపై బీజేపీ ఫోకస్‌

బీజేపీ ఈసారి కరీంనగర్‌ బల్దియాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 30కి పైగా డివిజన్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు, వారి అవినీతి అంశాలతో కార్నర్‌ చేయాలన్నది బీజేపీ ప్రధాన ఆయుధం. పలు డివిజన్లలో బీజేపీకి బలమైన నేతలు లేరు. అందుకే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఉన్న సమర్థులైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆ లోటు తీరుతుందని భావించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తన మంత్రాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎంఐఎం ప్రభావాన్ని అడ్డుకునేలా, ఓట్లు చీలకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలను 30 సీట్లకు పరిమితం చేయడం, తాను 30కిపైగా సీట్లు గెలవడం ద్వారా బల్దియాపై కార్పొరేషన్‌ను సొంతం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా బుధవారం పలువురు బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బీజేపీలో బలమైన నేతలకు గేట్లు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది.

సంక్రాంతి అనంతరం చేరికలు

కరీంనగర్‌ రాజకీయాల్లో బీజేపీకి ప్రధాన అండ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌. ఈసారి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి డివిజన్‌ వారీగా సమీక్షలు, సర్వేలు చేయిస్తూ పార్టీని యాక్టివ్‌ మోడ్‌లోకి తీసుకొచ్చారు. పార్టీ ఏయే డివిజన్లలో బలంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? ఎవరు సరైన అభ్యర్థి? అనే అంశాలపై ఇప్పటికే హోంవర్క్‌తో పాటు సర్వే పూర్తయ్యినట్టు తెలుస్తోంది. సంక్రాంతి అనంతరం (17వ తేదీ నుంచి) పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నేతలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బలమైన నేతలు పార్టీలోకి వస్తామన్న చోట.. వారికే డివిజన్‌ టికెట్లు ఇచ్చే విధంగా బండి వర్గం వారికి హామీలు ఇచ్చింది. దీంతో వారంతా కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు.

అవినీతి ప్రధానాస్త్రం

పదేళ్లపాలనలో బీఆర్‌ఎస్‌ అభివృద్ధిని విస్మరించి అవినీతిపై ఫోకస్‌ చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. స్మార్ట్‌సిటీ కేంద్ర నిధులతోనే నగరాన్ని అభివృద్ధి చేశామని, బీఆర్‌ఎస్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి భూకబ్జాలకు పాల్పడిన నేతలున్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ రెండేళ్లుగా అధికా రంలో ఉండి నగరపాలక సంస్థకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. కేవలం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఇచ్చిన నిధులతోనే కరీంనగర్‌ ఈ రోజు సుందరంగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ రెండు పార్టీల అవినీతిని ఎండగడుతూ కేంద్ర పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి మ్యాజిక్‌ ఫిగర్‌ను కై వసం చేసుకోవాలన్నది బీజేపీ ప్రధానాస్త్రంగా మార్చుకుని ముందుకెళ్లనుంది.

కేంద్ర నిధులు రావాలంటే బీజేపీకి పట్టం కట్టాలి

కరీంనగర్‌: కేంద్రం నుంచి కరీంనగర్‌కు నిధుల వరద కొనసాగాలంటే మేయర్‌ పీఠాన్ని బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పలుపార్టీల నేతలు బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించాలని కోరారు. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో కరీంనగర్‌ అభివృద్ధికి నయా పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. 51వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ బండారు వేణు, వల్లంపహడ్‌ మాజీ సర్పంచ్‌ సాధినేని మునీందర్‌, రాంనగర్‌కు చెందిన ప్రమోద్‌ రావు, మంకమ్మతోట గాజె శివరాం, బీఆర్‌ఎస్‌ నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement