ఘనంగా కాట్రావుల పండుగ
హుజూరాబాద్‌రూరల్: సంక్రాంతి సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే కాట్రావుల పండుగను మండలంలోని చిన్నపాపయ్యపల్లిలో సర్పంచ్ చల్లూరి చిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పశువులకు స్నానాలు చేయించి, కొమ్ములకు జాజు పూసి, పూల దండలువేసి తోరణాల కింది నుంచి తోలారు. రైతు జీవితంతో ముడిపడి ఉన్న ఎడ్లకు ఏడాదికోసారి సంక్రాంతి సందర్భంగా వచ్చే కాట్రావుల పండుగ ఒకప్పుడు ప్రతి గ్రామంలో రైతులు ఘనంగా జరుపుకునేవారు. గ్రామంలో ఈ ఆచారాన్ని కాపాడుతూ ప్రస్తుత రైతులు ఆదర్శంగా నిలిచారు.
‘ఉపాధి హామీ’పై పోరాటం
కరీంనగర్‌టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి అ న్నారు. బుధవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 17,18, తేదీల్లో జిల్లాలో రెండు ప్రచార జాతా లు నిర్వహిస్తున్నామన్నారు. 19న గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. రైతులు,వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం అశోక్, సహాయ కార్యదర్శి జునుతుల జనార్ధన్ పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతకం చేసిన నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డులను ఉచిత విద్యుత్ లబ్ధిదారులైన గృహజ్యోతి, రైతులకు బుధవారం కరీంనగర్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, అధికారులు ఇంటింటికి తిరుగుతూ అందజేశారు. డీఈ జంపాల రాజం, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏవో (రెవెన్యూ) లక్ష్మణ్, టౌన్–1ఏడీఈ పంజాల శ్రీని వాస్‌గౌడ్, ఏఏవో కె.అనిల్‌కుమార్, టౌన్–3 ఏఈ వెంకటరమణ, ఈఆర్‌వో పాల్గొన్నారు.
సీఎంకప్ యోగా పోటీలు విజయవంతం చేద్దాం
కరీంనగర్‌స్పోర్ట్స్: చీఫ్ మినిస్టర్ కప్ 2026 సెకండ్ ఎడిషన్‌లో భాగంగా జిల్లాలో జరిగే యోగా పోటీలను విజయవంతం చేయాలని తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పిలుపునిచ్చారు. జిల్లా యోగా అసోసియేషన్ కార్యవర్గ సమావేశం బుధవారం నగరంలో జరిగింది. రవీందర్ సింగ్ మాట్లాడుతూ వివిధ కేటగిరీల్లో క్రీడాకారుల ప్రతిభను గుర్తిస్తూ, ప్రోత్సహించడంలో సీఎంకప్ పోటీలు దోహదపడతాయన్నారు. జిల్లాకేంద్రంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు జిల్లా క్రీడల అధికారి చొరవ చూపాలన్నారు. డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ , జిల్లా యో గా అధ్యక్షుడు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, గసిరెడ్డి జనా ర్దన్‌రెడ్డి, కన్నకృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు.
ఘనంగా కాట్రావుల పండుగ
ఘనంగా కాట్రావుల పండుగ


