సంబురాల సంక్రాంతి
సంక్రాంతి వచ్చింది.. సంబురాలు తెచ్చింది. వానాకాలం పంట చేతికొచ్చి ఇల్లు చేరగా.. యాసంగి సాగు ప్రారంభమై.. చల్లని లోగిలిలో, మసకమసక చీకట్లలో కురిసే మంచు మనుసును పులకరింపజేస్తోంది. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల మువ్వల సవ్వడి, ఇంటి ముంగిట రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, బంతిపూల సోయగాలు, ఆడబిడ్డల ఆటపాటలతో ప్రతీ పల్లె వెలిగిపోతుండగా.. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించేప్పుడు వచ్చేదే మకర సంక్రాంతి. పండుగ ముందు రోజు భోగి వేడుకను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వేకువజామున్నే భోగి మంటలు వేసుకుని సందడి చేశారు. అందమైన ముగ్గులేసి గొబ్బెమ్మలు నిలిపి బంతిపూలతో అలంకరించారు. ఏటా పంటలు బాగా పండి, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కరీంనగర్ పరిధిలోని గోపాల్‌పూర్‌లో ఎడ్ల బండ్లతో ఊరేగింపు చేశారు. ఒగ్గు పూజారి సాయిల్ల శివయ్య డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్లబండ్లతో మల్లిఖార్జునస్వామి ఆలయం వరకు వెళ్లారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, స్వామివారికి మొక్కులు చెల్లించారు. నేడు సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలు వేడుకలకు సిద్ధం అయ్యారు. శుక్రవారం కనుమ పండుగ జరుపుకోనున్నారు. – కరీంనగర్ కల్చరల్/విద్యానగర్/కరీంనగర్‌రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
వైభవంగా భోగి.. రేపు కనుమ
సంబురాల సంక్రాంతి
సంబురాల సంక్రాంతి
సంబురాల సంక్రాంతి


