సకినాలు.. గారెలు.. అరిసెలు
మేయర్ పీఠం బీఆర్‌ఎస్‌దే..
కరీంనగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠం బీఆర్‌ఎస్ పార్టీదేనని కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవా రం నగర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జిలుగా హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటారన్నారు. 19న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
అర్చక సంఘం నాయకుడిపై చర్యలు తీసుకోవాలి
కరీంనగర్‌కల్చరల్: డీడీఎన్ అర్చకులను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీశ్ శర్మ, సంఘ నాయకులు మంగళవారం మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం ఇచ్చారు. ఓ సంఘం నాయకుడు డీడీఎన్ కార్డులని, రాష్ట్ర కార్యాలయంలోని అధికారులతో జిల్లా అధికారులకు ఫోన్లు చేయించి, వసూళ్ల పర్వం చేపట్టాడని ఫిర్యాదు చేశారు. యాగాలు, హోమాల పేరుతో డీడీఎన్ అర్చకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీడీఎన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్‌శర్మ పాల్గొన్నారు.
స్వల్పంగా పెరిగిన పత్తిధర
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవా రం క్వింటాల్‌కు 7,700 పలకగా.. మంగళవా రం రూ.150 పెరిగి రూ.7,850 పలికింది. 12 వాహనాల్లో 94 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,800, కనిష్ట ధర రూ.7,500కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవులుంటాయని, సోమవారం నుంచి క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
జిల్లాలో సరిపడా యూరియా
కరీంనగర్ అర్బన్: జిల్లాలో సరిపడా యూ రియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పమేలా సత్పతి వివరించారు. పక్షం రోజుల్లో 8,124 మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీలలో అందుబాటులోకి ఉంచామని, విక్రయాలు పోనూ 2,292 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరం మేరకు యూరియా తెప్పించి అందుబాటులో ఉంచుతామని అన్నారు.
వ్యత్యాసం?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ బల్దియా ఓటర్ల జాబితాపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. డీలిమిటేషన్ అనంతరం వార్డుల ఖరారు అయ్యాక ఇచ్చిన ఓటర్ల సంఖ్యకు జనవరి 1 తేదీన ఇచ్చిన ఓటర్ల సంఖ్యకు, 12వ తేదీన ఇచ్చిన ఓటర్ల సంఖ్యకు భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. వార్డుల వారీగా వంద సంఖ్యలో కొన్ని చోట్ల ఓట్లు పెరగగా, మరికొన్ని చోట్ల తగ్గడంపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను నివసిస్తున్న డివిజన్‌ను మార్చారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి సైతం తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
ఏం జరిగింది?
వార్డుల పునర్విభజన తరువాత 66 వార్డులకు సంబంధించి మొత్తం 3,35,592 ఓట్లు ఉన్నాయి. జనవరి 1న ముసాయిదా జాబితా ప్రకటించిన సమయంలో ఈ ఓట్లు 340,775కు పెరిగాయి. జనవరి 12వ తేదీన ప్రకటించిన తుది జాబితాలో ఓట్లు 3,40,540గా తేల్చారు. పునర్విభజనకు ముసాయిదా జాబితాకు 5,183 ఓట్ల వ్యత్యాసం ఉండగా.. తుది జాబితాకు వచ్చేసరికి అది 4,988 ఓట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా కూడా భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కొన్ని వార్డుల్లో వందలాది, వేలాది ఓట్లు పెరగగా, మరికొన్నింట్లో వందలాది ఓట్లు తగ్గుదల కనిపించింది. ఈ హెచ్చుతగ్గులు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభావితం చూపిస్తాయని, ఇది బడుగులు, దళితుల హక్కులను కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి
ఓటర్ల తుది జాబితాలో తీవ్రస్థాయిలో వచ్చిన తప్పులు రాజకీయరంగు పులుముకొంటుండడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏకంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓటు 52వ డివిజన్‌కు బదులు సంబంధం లేని 53వ డివిజన్‌లోకి రావడాన్ని సరిచేసేందుకు చర్యలు చేపట్టారు. నగరపాలకసంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక, మార్పులు చేయడానికి వీలు లేనప్పటికి, ప్రత్యేక పరిస్థితులపై నిర్ణయం తీసుకోవాలంటూ మెయిల్ పంపించారు. కాగా ఎన్నికల సంఘం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే తప్పులను సవరిస్తామని డీసీపీ బషీర్ తెలిపారు.
కార్పొరేషన్‌లో 477 పోలింగ్ కేంద్రాలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎన్నికలకు సిటీలో 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 66 డివిజన్లకు చెందిన పోలింగ్ కేంద్రా ల ముసాయిదా జాబితాను మంగళవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ విడుదల చేశారు. జాబితాపై బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు.
477 పోలింగ్ కేంద్రాలు
కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధంలో మరో అడుగు పడింది. నగరంలో మొత్తం 477 పోలిగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా డివిజన్‌లలో కిలోమీటరు దూరంలోపు పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకొన్నారు. అభ్యంతరాలు, పరిశీలన, సవరణ అనంతరం ఈ నెల 16వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా డివిజన్‌ల ప్రకారం ఫొటోలతో ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
రాజకీయపార్టీలతో సమావేశం
డివిజన్లవారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని 66 డివిజన్‌లలో 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ముసాయిదా ప్రకటించడంతో, ముసాయిదాపై చర్చించేందుకు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యత్యాసం ఇలా..
నగరంలోని రెండో డివిజన్‌లో 636 ఓట్లు పెరిగాయి. మూడో డివిజన్‌లో 530, ఏడో డివిజన్‌లో 1,270, 12వ డివిజన్‌లో 1,140, 15వ డివిజన్‌లో 659, 19వ డివిజన్‌లో 489 ఓట్లు పెరిగాయి. 28వ డివిజన్‌లో 487 ఓట్లు తగ్గాయి. 35వ డివిజన్‌లో 430, 41లో 410, 42లో 427, 53లో 504, 64లో 523 ఓట్లు తగ్గాయని అంటున్నారు.
సకినాలు.. గారెలు.. అరిసెలు
సకినాలు.. గారెలు.. అరిసెలు
సకినాలు.. గారెలు.. అరిసెలు
సకినాలు.. గారెలు.. అరిసెలు


