ఆలిండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక
జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన సుల్తాన్ సాగర్ రామగుండం కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆలిండియా పోలీస్ వాలీబాల్ సెలెక్షన్‌లో సెలెక్ట్ అయ్యాడు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగే ఆలిండియా పోలీస్ జట్టుకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు సీనియర్ క్రీడాకారుడు ఆవుల రాజు తెలిపాడు. సాగర్ ఎంపికపై గ్రామస్తులతో పాటు సీనియర్ క్రీడాకారులు ఆమరగాని గంగాధర్, కమలాకర్‌రెడ్డి, వెంకటేశ్, ఖాజామియా, సతీశ్, శేఖర్, మహేశ్, రాకేశ్ తదితరులు అభినందించారు.
రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్‌గా సయ్యద్ ఖాజాబీ
పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయస్థాయి అండర్–14 బాలికల వాలీబాల్ జట్టు కోచ్‌గా చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సయ్యద్ ఖాజాబీ ఎంపిక అయినట్లు తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, జిల్లా సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మన్, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్ తెలిపారు. ఖాజాబీ ఎంపికపై జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, చందనాపూర్ పాఠశాల హెచ్‌ఎం లక్ష్మి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ తమ్మన్నవేని రాజయ్య, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సురేందర్, దాసరి రమేశ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు కొమురోజు శ్రీనివాస్, తులా శోభారాణి, శైలజ, మాధవి, మాధురి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
టిప్పర్ల పట్టివేత
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఆదివారం పట్టుకున్నట్లు సుల్తానా బాద్ ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎలిగేడు మండలం నుంచి వేబిల్లు లేకుండా మట్టిని టిప్పర్లలో తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆలిండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక
ఆలిండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక


