వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
వృద్ధుడికి గాయాలు
కోనరావుపేట మండలం నిజామాబాద్ ఎల్లమ్మ గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా పొన్నాజిపేటకు చెందిన రామయ్య(65) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీరీలదర్గా వద్ద ఆదివారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం గోరింట్యాలకు చెందిన అతికం దత్తాద్రిగౌడ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై ఎల్లారెడ్డిపేటకు వస్తున్నాడు. అదే సమయంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన గంగాధరి కిరణ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దత్తాద్రిగౌడ్‌తోపాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. దత్తాద్రిగౌడ్ భార్య మీనా ఫిర్యాదుతో కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు


