ప్రజెంటేషన్ ముఖ్యం
విద్యార్థులు తెలివి తేటలు జ్ఞాపకశక్తి కన్నా పరీక్షల్లో ప్రజంటేషన్ కీలకం. చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై తెలిసిన ప్రశ్నలకు సైతం జవాబులు రాయలేరు. పిల్లలను స్వేచ్ఛగా చదవనివ్వాలి. ఏ సమయంలోనైనా పరీక్షను సులభంగా రాయగలిగేలా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయు కృషితోనే ఇది సాధ్యం. – అట్ల శ్రీనివాస్‌రెడ్డి,
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్
ఏడాది శ్రమ వృథా అవుతుంది
పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనైతే ఏడాది కష్టం వృథా అవుతుంది. తెలిసిన అంశాలకు స్పష్టమైన సమాధానాలు రాయాలి. మనోవిజ్ఞానికంగా ఉన్న విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తే మంచి మార్కులు వస్తాయి. పరీక్షల కోసం చదివేటప్పుడు మాత్రమే లక్ష్యం ఉండాలి.
– గాజుల రవీందర్,
ఉపాధ్యాయుడు, జెడ్పీ పాఠశాల సప్తగిరికాలనీ
టీవీలు బంద్ చేయడం ఉత్తమం
తల్లిదండ్రులు ఎక్కువ సమయం టీవీల ముందు కాలక్షేపం చేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుంది. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి. లేదంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. బయట ఆహారానికి పుల్‌స్టాప్ పెట్టి ఇంటి వంటలే చేసి పెట్టాలి.
– శనిగరపు రవీందర్,
గణిత ఉపాధ్యాయుల
ప్రజెంటేషన్ ముఖ్యం
ప్రజెంటేషన్ ముఖ్యం


