కొండగట్టు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
కరీంనగర్‌టౌన్: కొండగట్టు ఆలయ అభివృద్ధికి బీఆర్‌ఎస్ హయంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆలయ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు. కరీంనగర్‌లో ఆదివారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సత్యం చేసిన ఆరోపణాలు సరికాదన్నారు. కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిధులు తీసుకురావడం శుభపరిణామం అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొండగట్టుకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యకు మేడిపల్లి సత్యం కట్టుబడి ఉండాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే 680ఎకరాల భూమిని కొండగట్టు ఆలయానికి కేటాయించిన విషయం గుర్తు చేశారు. గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, చీకట్ల రాజశేఖర్, పూడూరు మల్లేశం, విజయేందర్‌రెడ్డి, ఉప్పల గంగన్న, నాగ శేఖర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యం అసత్యాలు మాట్లాడొద్దు
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్


