ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఆరుగురికి గాయాలు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం మేడిపల్లిలో ఆదివారం వేకువజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. మేడిపల్లి వద్దకు చేరుకోగానే.. కమ్మర్‌పల్లి వైపు నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని కోరుట్ల పట్టణానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు.


