
ఒక్కడి ఆనందం... బడి‘బాట’గా మారింది
కరీంనగర్‌టౌన్: ఆ ఒక్కడి కళ్లలో ఆనందం.. వేల మంది పేద విద్యార్థులకు బడి దారి చూపింది. నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామం బామినిలో తల్లిదండ్రులను కోల్పోయి ముసలి అవ్వతో ఉంటున్న 11 ఏళ్ల పిల్లాడు రాంచరణ్‌కు సైకిల్ తొక్కుతూ స్కూల్‌కు వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా... కొనే స్థోమత లేక స్కూల్ మానేసి మానసిక బాధను అనుభవిస్తున్న ఆ పిల్లవాడి కోరికను ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ సఫలం చేసిన క్షణాన ఆ పిల్లవాడి చిరునవ్వు.. సంజయ్ మనసులో బలంగా నాటుకు పోయింది. దాని ఫలితమే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పారిశ్రామికవేత్తల సహకారంతో సేకరించిన సీఎస్సార్ ఫండ్స్ తో శ్రీమోదీ గిఫ్ట్‌శ్రీ పేరుతో 20 వేలకుపైగా సైకిళ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాల, శిశు మందిర్ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 9న కరీంనగర్ నియోజకవర్గం, 15న రాజన్నసిరిసిల్ల జిల్లా, 17న హుజూరాబాద్‌లో వేలాది సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యింది. శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రేపు హుస్నాబాద్ నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ
హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్