
ప్రభుత్వ ఆస్పత్రిలో కత్తిపోట్ల కలకలం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిలో గురువారం కత్తిపోట్ల కలకలం రేపింది. స్థానికులు కథనం.. చొప్పదండి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రావణిని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన పాలకుర్తి మహేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు.కాగా... శ్రావణి ఇటీవలే గర్భం దాల్చగా చికిత్స నిమిత్తం భర్త పాలకుర్తి మహేశ్ కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు రక్తస్రావం కావడం.. కడుపులో పిండం సరిగా లేకపోవడంతో వైద్యులు అబార్షన్ చేశారు. విషయం తెలుసుకున్న శ్రావణి అన్న అదే ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్ బావ పాలకుర్తి మహేశ్‌పై కత్తితో దాడిచేశాడు. దీంతో ఆయనకు పలుచోట్ల గాయాలయ్యాయి. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వండంతో టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. గాయపడ్డ పాలకుర్తి మహేశ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.