
అపోహలు వద్దు
1978 జులై 25న ఇంగ్లండ్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అనే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో జన్మించిన మొదటి బిడ్డ లూయీస్ బ్రౌన్ అయ్యారు. ఈ విజయానికి గుర్తుగా ఏటా జులై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డేగా జరుపుతారు. ఇప్పటికీ చాలామందికి ఐవీఎఫ్ అంటే తెలియని భయం. సంతానం కలిగేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తాం.
– డాక్టర్ రేఖారాణి, రేఖాసాగర్ ఐవీఎఫ్ సెంటర్
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
30 ఏళ్లు దాటిన మహిళలకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 8 మిలియన్ల మందికి పైగా జన్మించారు. అయితే ఐవీఎఫ్‌పై చాలామందికి అపోహలున్నాయి. ఐవీఎఫ్‌లోనూ ఐసీఎస్‌ఐ, ఐవీఎం, ఎగ్‌ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, ప్రీ ఇంప్లాంటేషన్, జనటిన్ టెస్ట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. ఐవీఎఫ్‌లో ఇచ్చే మందులతోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. – డాక్టర్ రజని ప్రియదర్శిని, రజని ఫెర్టిలిటీ సెంటర్

అపోహలు వద్దు