
అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలని ఆందోళన
పాలకుర్తి(రామగుండం): ఇంటి కొనుగోలు కోసం చెల్లించిన డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న ఓ వ్యక్తి నివాసం ఎదుట బాధితులు ఆందోళన చేసిన ఘటన బుధవారం కన్నాల గ్రామ పంచాయతీ పరిధి బోడగుట్టపల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు పుప్పాల రాజిరెడ్డి కథనం ప్రకారం.. కన్నాలకు చెందిన మల్క లింగయ్య గతేడాది తనఇంటిని విక్రయించేందుకు నిర్ణయించగా.. రూ.46 లక్షలకు రాజిరెడ్డి కొనుగోలు చేసేందుకు అంగీకరించి తొలుత రూ.26లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగతా సొమ్ము రిజిస్ట్రేషన్ సందర్భంగా చెల్లించేందుకు నిర్ణయించాడు. అయితే, ఏడాదిగా ఇంటి రిజిస్ట్రేషన్ చేయకుండా, అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి చెల్లించకుండా మొండికేస్తున్నాడు. దీంతో తన డబ్బులు తనకు కావాలంటూ లింగయ్య ఇంటిగేట్‌కు రాజిరెడ్డి తాళం వేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బైఠాయించాడు. చివరకు పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఎస్సై స్వామి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం పెద్దమనుషుల సమక్షంలో సమస్య పరిష్కరించుకుంటామని లింగయ్య హామీ ఇచ్చారు. దీంతో రాజిరెడ్డి కుటుంబం ఆందోళన విరమించింది.