
ముగ్గురు దొంగలపై కేసులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల తంగళ్లపల్లి మండలంలో కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగతనానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు. తంగళ్లపల్లి మండలంలో కొంతకాలంగా ఆడెపు రవికుమార్, మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా ఒకరు పరారీలో ఉన్నాడు. వీరు ఏడు నెలలుగా మండలంతోపాటు ముస్తాబాద్, మాచారెడ్డి, సిరిసిల్ల, వేములవాడలో 10 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. వీటిలో కొన్ని బైకులను చందుర్తి, కరీంనగర్, సిరిసిల్లలోని కొందరికి విక్రయించారు. ఈ బైకులను కొన్న వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై ఉపేంద్రాచారి, హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, బాలనర్సయ్య, కానిస్టేబుల్ నరేందర్, రామ్మోహన్, వికాస్‌లను అభినందించారు.