
అంజన్న హుండీ ఆదాయం రూ.1.10 కోట్లు
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలోని 13 హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బుధవారం ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పరిశీలకులు రాజమౌళి సమక్షంలో శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు లెక్కించారు. 53 రోజులకుగాను రూ.1,10,03,402 వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ నోట్లు 61, మిశ్రమ వెండి, బంగారం తిరిగి బ్యాగుల్లో వేసి, సీల్ చేసి హుండీలో భద్రపరిచినట్లు ఈఓ తెలిపారు. స్థానాచార్యులు తిరుకోవెల కపీందర్, పర్యవేక్షకులు దేశిని సునీల్‌కుమార్, నీల చంద్రశేఖర్, గుండి హరిహరనాథ్, అశోక్‌కుమార్, సుధాకర్, రాములు, రవి కుమార్ పాల్గొన్నారు.