
దక్షిణ ఇండియా సంఘం పీఠాధిపతిగా బిషప్ రూబెన్ మార్క్
విద్యానగర్(కరీంనగర్): దక్షిణ ఇండియా సంఘ పీఠాధిపతిగా కరీంనగర్ బిషప్ డాక్టర్ కె రూబెన్ మార్క్ ఎన్నికయ్యారు. సోమవారం చెన్త్నెలో జరిగిన ఐదు రాష్ట్రాల పీఠాధిపతి ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజారిటీతో పీఠాధిపతిగా గెలిచారు. కె.రూబెన్ ఎన్నికై న సందర్భంగా కరీంనగర్ అధ్యక్ష మండల కార్యాలయం ప్రాంగణంలో వెస్లీ క్యాథడ్రల్ చర్చ్ సంఘ సభ్యులు, సెంటనరీ చర్చ్ సంఘ సభ్యులు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో కరీంనగర్ అధ్యక్ష మండల సెక్రటరీ ఎర్ర జాకబ్, కరీంనగర్ అధ్యక్ష మండల లే లీడర్ కాదాసి ప్రశాంత్, కరీంనగర్ వెస్లీ క్యాథెడ్రల్ సెంటనరీ, ఎల్‌ఎండీ చర్చి సభ్యులు జీబీ సంజయ్, సత్యం, సీహెచ్ శామ్యూల్, కట్ట బెనర్, బొబ్బిలి విక్టర్, సూర్య ప్రకాశ్, నికోలస్, సూర్య తదితరులు పాల్గొన్నారు.